Tuesday, 3 November 2026

పోచారానికి మంత్రి కెటిఆర్‌ పరామర్శ

హైదరాబాద్‌,జూన్‌28(జ‌నం సాక్షి):రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ గురువారం పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డికి ఓ ప్రయివేటు ఆస్పత్రిలో మోకాలి చిప్ప మార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. దీంతో మంత్రి పోచారం ఆస్పత్రిలోనే ఉన్నారు. ఆస్పత్రి నుంచే రైతు బీమా పథకంపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన కెటిఆర్‌ ఆయనను కలసి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు.