ఉద్యోగం కోసం ఎదురుచూపులా!
– సీఎం దృష్టిసారించి తమకు న్యాయం చేయాలి
– ప్రగతిభవన్‌లోకి వెళ్లేందుకు గ్రూప్-2 అభ్యర్థుల యత్నం
– అదుపులోకి తీసుకున్న పోలీసులు
హైదరాబాద్, మే30(జనం సాక్షి) : పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఏళ్లు గడుస్తున్నా.. ఉద్యోగం కోసం ఎదురుచూపులు చూడాల్సి వస్తుందని, సీఎం కేసీఆర్ స్పందించి తమకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని గ్రూప్ -2 అభ్యర్థులు డిమాండ్ చేశారు. బుధవారం తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రగతిభవన్‌కు బయల్దేరిన గ్రూప్-2 అభ్యర్థులను పోలీసులు అరెస్టుచేశారు. అనంతరం వారిని గోషామహల్ పీఎస్‌కు తరలించారు. ఈసందర్భంగా గ్రూప్ -2 అభ్యర్థులు మాట్లాడుతూ.. కోర్టు కేసుల జాప్యం కారణంగా తమ ఉద్యోగాల నియామక పక్రియ ఆగిపోయిందని… దీంతో తమకు న్యాయం చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ వచ్చి రెండున్నరేళ్లు గడిచిందని… పరీక్ష రాసి ఏడాదిన్నర గడిచిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం జూన్ 2న ఫలితాలు ప్రకటించారని… అప్పటి నుంచి ఇప్పటివరకు ఉద్యోగాల కల్పన జరగలేదన్నారు. అడ్వకేట్ జనరల్‌ను నియమించి.. కోర్టు కేసులను సత్వరం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ సాధనలో తాము భాగస్వాములు కావాలని ఉందని… ముఖ్యమంత్రి వెంటనే స్పందించి తమ సమస్య పరిష్కరించాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. మూడో పర్యాయం కేసీఆర్‌ను కలిసి నియామకాలను ముందుకు తీసుకెళ్లాలని కోరేందుకు రాత పరీక్షలో ఉత్తీర్ణులైన 300 మంది అభ్యర్థులం ఇక్కడికి వచ్చామని అన్నారు. 100 మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారని, కానీ ఈసారి కూడా ప్రగతి భవన్ దగ్గరికి చేరుకోకముందే పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేసి గోషా మహల్ స్టేడియానికి తరలించడం దారుణమన్నారు. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ ప్రభుత్వం నుండి స్పష్టమైన హావిూ వచ్చే వరకు ఎన్ని రోజులు అయినా కూడా 300 మంది ఎంపికైన అభ్యర్థులం గోషా మహల్ స్టేడియంలోనే మౌనదీక్ష చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. విూడియా సహకారంతో మా సమస్య తీవ్రతను తెలియజేస్తున్నామని కొందరు అభ్యర్థులు వివరించారు.
పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా..




