పోడుభూములకు పట్టాలు ఇవ్వాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల్లో సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూమేరకు పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి తొడసం భీంరావు కోరారు. ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు సంబంధించిన హక్కు పత్రాలు సర్పంచ్‌ ఎన్నికలకు ముందే ఇవ్వాలని కోరారు. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు  గిరిజనుల ప్రధాన సమ స్య భూమిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదివాసీ గిరిజనులను ఇతర పేదలను ఆదుకునేందుకు తక్ష ణ చర్యలు తీసుకోవాలన్నారు. పంచాయతీ ఎన్నికల ముందే ఈ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌ జిల్లా కేంద్రాల్లో మినీ ఐటీడీఏ కేంద్రాలను ఏ ర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను గిరిజనులకు అందేవిధంగా చూడాలన్నారు.