Wednesday, 4 November 2026

పోయిన ఎకె 47 దొరికింది: ఎస్పీ

విజయనగరం,నవంబర్‌3(జ‌నంసాక్షి): డెంకాడ మండలం నాతవలస టోల్‌ గేటు వద్ద మిస్సయిన ఏ.కె.47 గన్‌ దొంగిలించిన ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జి పాలరాజు తెలిపారు. విజయనగరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అక్టోబర్‌ 13 తేదిన ఓటింగ్‌ మెటిరయల్‌ కాన్వాయి హైవే పై ఆపిన సమయంలో సాహూ అనే ఓరిస్సా కానిస్టేబుల్‌ వేపన్‌ ఏకే 47 దొంగిలించబడిందన్నారు. ఈ కేసులో సంజూరామ్‌ సిందూ, నగేష్‌ సిందూ అనే వ్యక్తులను అరేస్ట్‌ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఒరిస్సా పోలీసులకు ఏ.కె.47 గన్‌ ను అప్పగిస్తామన్నారు. దొంగలను పట్టుకోవడంలో కీలక పాత్ర వహించిన పోలీసు అధికారులు, సిబ్బంది కి రూ.25వేలు క్యాష్‌ రివార్డు ప్రకటిస్తామన్నారు.