Wednesday, 4 November 2026

పోలవరం వద్ద కుంగిన సర్వీస్‌ రోడ్డు

ఏలూరు,నవంబర్‌3(జ‌నంసాక్షి): పశ్చిమగోదావరి పోలవరం సర్వీస్‌ రోడ్డు కుంగిపోయింది. దీంతో ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు కుంగి పోవడం తో భారీగా రోడ్లు పైకి లేచి పోయి బీటలు వారింది దీంతో ప్రాజెక్ట్‌ ప్రాంతంలో ఉన్న లారీ డ్రైవర్లు భూకంపం గా భావించి లారీలు వదిలి పోయే పారిపోయే పరిస్థితిఏర్పడింది.. ఈ విషయం పోలవరం ప్రాజెక్ట్‌ ఇంజినీర్లకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకుని కుంగిపోవడం కారణాలపై ఆరా తీస్తున్నారు