Tuesday, 3 November 2026

పోలవరానికి కేటాయింపులపై నేతల మండిపాటు

ఏలూరు,మార్చి3(జ‌నంసాక్షి): పోలవరం  జాతీయ ప్రాజెక్ట్‌కు కేంద్రం కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమైన విషయమని దీనిపై కేంద్రం పునరాలోచన చేయాలని జలవనరుల నిపుణుడు రామకృష్ణంరాజు కోరారు. పోలవరం విషయంపై మాట్లాడేందుకు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవనున్నట్లు నాయకులు ప్రకటించారు. కేంద్రంపై ఆధారపడకుండా ఏటా రూ.2 వేల కోట్ల చొప్పున రాష్ట్ర బ్జడెట్‌లో నిధులు కేటాయిస్తే పోలవరం  ప్రాజెక్ట్‌ చాలా వరకు పూర్తవుతుందన్నారు. తర్వాత కేంద్రం నుంచి రీయంబర్స్‌మెంట్‌ విధానంలో ఖర్చు చేసిన నిధులు రాబట్టుకోవచ్చన్నారు. ఆంధప్రదేశ్‌లోని పదమూడు జిల్లాలకు గోదావరి నీరే శరణ్యమని  అన్నారు.  పోలవరం ప్రాజెక్ట్‌ను రానున్న నాలుగేళ్లలో పూర్తి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో ప్రకటించారన్నారు. తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై నిర్మిస్తున్న దేవాదుల ప్రాజెక్ట్‌ ఫేజ్‌-1,2 పనులు, కాంతాలపల్లి ప్రాజెక్ట్‌లు ఏడాదిలోపే పూర్తి చేయనుందన్నారు. ఆ తర్వాత ఆయా ప్రాంతాల నుంచి గోదావరి డెల్టాకి ఒక్క చుక్కనీరు కూడా రాదన్నారు. వెంటనే పోలవరం ప్రాజెక్ట్‌ పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఇదిలావుంటే  రబీ పంటల కోసం గోదావరి డెల్టాకు డొంకరాయి డ్యామ్‌ నుంచి అదనంగా వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గోదావరి డెల్టాలో రబీ పంటల కోసం సీలేరు జలాశయాల నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ నిత్యం 4,500 క్యూసెక్కుల నీటిని పవర్‌కెనాల్‌ ద్వారా విడుదల చేస్తున్నారు. ఈ నీరు డెల్టా పరిధిలోని 10 లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో అందడం లేదని రైతులు ఆందోళన చేస్తున్నారు. పంట చేతికొచ్చే సమయంలో నీరు అందకుంటే ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చేయడంతోఉభయ గోదావరి జిల్లా ప్రతినిధుల డిమాండు మేరకు ఉన్నతాధికారులు ఏపీపీ జెన్‌కో, నీటిపారుదల శాఖాధికారులతో సమావేశమయ్యారు. సీలేరు కాం/-లపెక్సులోని నీటి వనరుల గురించి చర్చించి ప్రస్తుతం విడుదల చేస్తున్న దానికంటే అదనంగా నీరు విడుదల చేసే అవకాశాలపై చర్చించారు. ఇప్పటికే పవర్‌కెనాల్‌ సామర్థ్యం దాటి నీటిని డెల్టాకు విడుదల చేస్తున్నామని జెన్‌కో అధికారులు తెలిపినట్లు సమాచారం. చర్చల అనంతరం అదనంగా వెయ్యి క్యూసెక్కుల నీటిని నేరుగా జలాశయం నుంచి విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *