– రెండు నెలలు కేసు దర్యాప్తు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, జులై21(జనం సాక్షి) : మాదాపూర్ పోలీసులకు హేతువాది బాబుగోగిని షాకిచ్చారు. బాబుపై మాదాపూర్‌లో నమోదైన కేసు దర్యాప్తును రెండు నెలల పాటు నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బిగ్‌బాస్‌షోలో ఉన్నందున విచారణకు హాజరుకాలేంటూ బాబుగోగినేని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కేసు దర్యాప్తును రెండు నెలల పాటు నిలిపివేయాలని ఆదేశించింది. బిగ్‌బాస్ షోకు వెళ్లి బాబు గోగినేనికి నోటీసులు ఇవ్వాలనుకున్న పోలీసులు కోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గారు. బిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీవీఛానళ్లు, సోషల్ విూడియాలో విమర్శలు చేస్తున్నారని, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఆధార్‌కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని బాబు గోగినేనిపై గత నెల 26న మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో వీరనారాయణ ఫిర్యాదు చేశారు. దీంతో బాబు గోగినేనిపై దేశద్రోహం, ఆధార్‌చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా రెండు నెలల పాటు దర్యాప్తు నిలిపివేయాలంటూ కోర్టు ఆదేశించింది. దీంతో బాబుగోగినేని బిగ్‌బాస్‌షోలో కొనసాగనున్నారు.
పోలీసులకు షాకిచ్చిన బాబు గోగినేని




