Tuesday, 3 November 2026

పోలీసుశాఖలో పారదర్శకత తీసుకువస్తా

– నూతన డీజీపీ ఆర్పీ ఠాకూర్‌
అమరావతి, జూన్‌30(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌ పోలీసు శాఖలో మరింత పారదర్శకత తీసుకువస్తామని రాష్ట్ర నూతన డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ చెప్పారు. శనివారం ఓ విూడియాతో మాట్లాడిన ఆయన పలు విషయాలు వెల్లడించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా పోలీస్‌ వ్యవస్థను తయారు చేస్తామన్నారు. పోలీస్‌ శాఖకు అవసరమైన వాహనాలు సమకూరుస్తామని తెలిపారు. పోలీసుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు. తనకు ఈ పదవిని అప్పగించినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభించిందన్నారు. శాంతి భద్రత పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కొత్త చట్టాన్ని తెచ్చి అవినీతిపరుల ఆస్తులను ప్రభుత్వపరం చేశామన్నారు. ఏపీని అవినీతిరహిత రాష్ట్రంగా మార్చామని, అవినీతి నిర్మూలనలో ఏపీ స్థానం మెరుగుపడిందన్నారు. సీఎం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తామని తెలిపారు.