Monday, 2 November 2026

పోలీసు అమరవీరుల సంస్మరణ పరుగు

హైదరాబాద్‌ : దేశ రక్షణలో యువత కీలక పాత్ర పోషించాలని గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. హైదరాబాద్‌ నెక్లస్‌ రోడ్డులో పోలీసు అమరవీరుల స్మారకార్థం నిర్వహించిన పరుగును ఆయన ప్రారంభించారు. దేశం కోసం అనేక మంది అమరవీరులు త్యాగం చేశారని యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని దేశ రక్షణకు ముందుకురావాలన్నారు. పరుగుకోసం తరలివచ్చిన పోలీసులు, యువతకు రాష్ట్ర డీజీపీ అనురాగ్‌ శర్మ అభినందనలు తెలిపారు. 10కే, 5కే, 2కే విభాగంలో పరుగును గవర్నర్‌, డీజీపీ జెండా వూపి ప్రారంభించారు. నెక్లస్‌ రోడ్డు నుంచి ఎన్టీఆర్‌ మార్గ్‌, ట్యాంక్‌బండ్‌ మీదుగా పరుగుసాగింది. సుమారు 5 వేలమందికిపైగా ఈ పరుగులో పాల్గొన్నారు.