Wednesday, 4 November 2026

పోలీస్‌ శాఖలో కలకలం

అవినీతి ఖాకీల జాబితా విడుదల చేసిన డీజీపీ కార్యాలయం
391మంది అవినీతి పరులతో జాబితా
అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో అవినీతి ఖాకీలు
350మందిని తక్షణమే బదిలీలు చేయండి
జిల్లా ఎస్పీ, కమిషనర్‌లను ఆదేశించిన డీజీపీ మహేందర్‌రెడ్డి
హైదరాబాద్‌, జూన్‌7(జ‌నం సాక్షి) : తెలంగాణ వ్యాప్తంగా పోలీసు శాఖలో కలకలంరేగింది. రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్లవారీగా 391మంది అవినీతి ఖాకీలు ఉన్నట్లు డీజీపీ కార్యాలయం గుర్తించింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో అవినీతి ఖాకీలు ఉన్నట్లు బయటపడింది. ఐడీ, కైం, స్పెషల్‌ పార్టీల పేరుతో మామూళ్లు వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. కానిస్టేబుళ్ల చేత మామూళ్లు వసూలు చేయిస్తున్న సీఐలు, ఎస్‌ఐలు, ఇతర అధికారుల పేర్లు డీజీపీ ఆఫీస్‌ వెల్లడించింది. వీరిపై చర్యలు తీసుకునేందుకు డీజీపీ మహేందర్‌రెడ్డి సిద్ధమయ్యారు. అవినీతి ఖాకీలను బదిలీ చేయాలని డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ ఉత్తర్వులు తెలంగాణ పోలీసుల్లో సంచలనం సృష్టిస్తోంది. తలసరి మామూళ్లు వసూలు చేసే పోలీస్‌ సిబ్బందిపై తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. పోలీసుల మామూళ్ల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి నిఘా విభాగాల ద్వారా తెప్పించుకున్న సమాచారం ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 350 మంది పోలీసులను హెచ్చరించారు. సమాచారం ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా 350 మంది అవినీతి పరులను బదిలీ చేయమని జిల్లా ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ గురువారం ఆదేశాలు జారీ చేశారు. మామూళ్లు వసూలు చేస్తున్న కానిస్టేబుళ్లు, ¬ంగార్డులు, ఏఎస్‌ఐలు బదిలీ కానున్నారు. భవిష్యత్‌లో ఇలాంటివి మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎం.మహేందర్‌ రెడ్డి డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తరువాత ప్రత్యేక బృందాల అవినీతి అక్రమాలపై విచారణకు ఆదేశించారు. ఈ ప్రత్యేక బృందాలపై వస్తున్నఆరోపణలు ఎంతవరకు వాస్తవమో తెలుసుకోడానికి కమిటీని ఏర్పాటు చేసి క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను నివేదించాల్సిందిగా ఆదేశించారు. కమిటీ లోతైన విచారణ కొనసాగించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. వీరంతా తమకు అప్పగించిన విధులు పక్కన పెట్టి దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకునే పనిని కొనసాగిస్తున్నట్లు తేలింది. నేరాల నిరోధానికి పని చేయాల్సిన ఎస్పీ, డీఎస్పీ, ఏసీపీ, డీసీపీ, కమిషనర్‌లకు అనుబంధంగా పని చేస్తున్న ప్రత్యేక బృందాలు ఆ దిశలో పని చేయడం లేదని నివేదికలో వెల్లడైనట్లు తెలుస్తోంది. సివిల్‌ డ్రెస్‌లో విధులు నిర్వహిస్తూ… నేరస్ధులను అరెస్ట్‌ చేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఆసాంఘిక శక్తులపై నిఘా ఉంచి వారి కదలికలను ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేయడం లాంటి విధులు నిర్వహిస్తుంటారు. కాని ప్రత్యేక బృందాల్లో ఎక్కువ భాగం నెలనెలా మామూళ్లు ఏర్పాటు చేసుకుని నిర్దేశించిన విధులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నట్లు తేలింది. దీంతో ఆలాంటి వారి జాబితా తెప్పించుకున్న డీజీపీ మహేందర్‌ రెడ్డి… తక్షణమే ప్రత్యేక బృందాలను రద్దుచేసి వారందరినీ పూర్వ విభాగాలకు పంపాలని ఆయా కమిషనర్లకు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. డీజీపీకి అందిన జాబితాలో రాష్ట్ర వ్యాప్తంగా 391 మంది ఉన్నట్లు పేర్లు, వారి ¬దాతో కూడిన వివరాలు బయటకు రావడంతో పోలీసు శాఖలో ఇది చర్చనీయాంశమైంది. వీరందరిపై తదుపరి ఎలాంటి చర్యలు ఉంటాయో వేచి చూడాల్సి ఉంది.
వసూళ్లకు పాల్పడుతున్న11 మందిపై బదిలీ వేటు..
హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని 11మంది పోలీస్‌ సిబ్బందిపై బదిలీ వేటు పడింది. షాహినాథ్‌గంజ్‌కు చెందిన ఏఎస్సై బ్రహ్మం, కానిస్టేబుల్‌ మహేశ్‌, అసీఫ్‌నగర్‌ ఠాణాకు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ కె.అలెగ్జాండర్‌, గోల్కొండ ఠాణాకు చెందిన కానిస్టేబుల్‌ పి.నగేశ్‌, టప్పాచబుత్ర ఠాణాకు చెందిన కానిస్టేబుల్‌ బి.శ్రీకాంత్‌, మంగళ్‌హాట్‌ ఠాణాకు చెందిన కానిస్టేబుల్‌ వై.సాంబయ్య, ఎ.బాలనర్సయ్య, కుల్సుంపురాకు చెందిన ¬ంగార్డు వేణు, పంజాగుట్టకు చెందిన శంకర్‌నాయక్‌, చిలుకలగూడకు చెందిన ¬ంగార్డులు రాంసింగ్‌, నాగరాజ్‌లపై బదిలీ వేటు పడింది.
వీళ్లంతా మద్యం దుకాణాలు, బార్లు, కల్లుదుకాణాలు, వాణిజ్య సంస్థలు, ¬టల్స్‌తోపాటు కేసులు ఎదుర్కొనే నేరస్తుల నుంచి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇందులో కొందరు ఎస్సైల తరఫున వసూళ్లకు పాల్పడుతుండగా, మరికొందరు ఆయా ఠాణాల పరిధిలో కలెక్టర్లుగా చలామణి అవుతున్నట్లు నిఘా వర్గాల నుంచి ఉన్నతాధికారులకు సమాచారం వచ్చింది. దీంతో అవినీతి అక్రమాలకు పాల్పడే వారిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.