కార్మికులకు ఎమ్మెల్యే పరామర్శ
నెల్లూరు,జూన్7(జనం సాక్షి): నెల్లూరు నగరంలో భూగర్భ డ్రైనేజీ పనుల నిమిత్తం డ్రైనజీలోకి దిగినముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారు నెల్లూరు నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పి.అనిల్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్,కార్పొరేషన్ ప్లోర్ లీడర్ పి.రూప్ కుమార్ యాదవ్, కార్పొరేటర్లు, నాయకులతో కలిసి పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ ఘటనలో వారికి ఉత్తమ చికిత్స అందించాలని కోరారు.