Tuesday, 3 November 2026

ప్రకాశ్ జవదేకర్‌తో సీఎం కేసీఆర్ భేటీ

ఢిల్లీ: కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమలకు పర్యావరణ అనుమతులపై సమావేశంలో చర్చిస్తున్నారు. అంతకు ముందు కేంద్ర మంత్రి నరేంద్రసింగ్ తోమర్‌తో సమావేశం నిర్వహించిన కేసీఆర్ బయ్యారం ఉక్కు పరిశ్రమపై చర్చించారు. నిన్న ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్ కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తూ ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *