Wednesday, 4 November 2026

*ప్రకృతి ఒడిలో అందాల జలపాతం బొగత,*

పర్యాటకులను కనువిందు చేయనున్న జలపాతం,*

వాజేడు జూన్ 23 జనం సాక్షి:
తెలంగాణ నయాగారగా పిలువబడే బొగత జలపాతంలో జలకళ సంతరించుకుంది,ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీప్రాంతంలో ఉన్న తెలంగాణ నయాగార బోగత జలపాతం తొలకరి వర్షాలకే వరద నీరు చేరడంతో బోగత అందాలు పర్యాటకులను కనువిందు చేయనుంది, దట్టమైన అడవి కొండ కొనాల నుండి జాలువారుతూ 50 అడుగుల ఎత్తునుండి కిందకు తెల్లని పాల నురగలా జాలువరుతూ ప్రకృతి అందాలను పర్యాటకులకు కనువిందు పండగ చేయనుంది,