డికె తదితరులకు పోలీసుల స్పష్టీకరణ
హైదరాబాద్,అక్టోబర్27(జనంసాక్షి): దుబ్బాక ఎన్నికల ప్రచారానికి వెళ్ళేందుకు బీజేపీ నేతలు డీకే
అరుణ, మోత్కుపల్లికి పోలీసులు అనుమతినిచ్చారు. ప్రగతి భవన్‌కు వెళ్ళొద్దంటూ వారికి ఎస్కార్ట్ వాహనం ఇచ్చి పోలీసులు పంపించారు. అంతకు ముందు డీకే అరుణ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దుబ్బాక ప్రచారానికి వెళ్లాలని చెప్పినప్పటికీ బయటకు రావొద్దంటూ పోలీసులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లాల్సిందే అని డీకే అరుణ పట్టుబట్టారు. చివరకు పోలీసులు ఇరువురు నేతలకు ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు అనుమతినిచ్చారు.
ప్రగతిభవన్‌కు అనుమతి లేదు




