– 28,29 తేదీల్లో రాహుల్ పర్యటనలు
– రాహుల్‌తో ప్రచారంలో పాల్గోనున్న ఏపీ సీఎం చంద్రబాబు
హైదరాబాద్, నవంబర్24(జనంసాక్షి) : ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ వేగం పెంచింది. శుక్రవారం మేడ్చల్‌లో సభతో ఎన్నికల వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్, మాజీ అధ్యక్షురాలు సోనియా ఈ సభకు హాజరయ్యారు. ఇలా ఇద్దరూ ఒకే సభలో పాల్గొంటున్న అరుదైన సందర్భం కావడం, తెలంగాణ ఏర్పాటైన తర్వాత సోనియా తొలిసారి వస్తుండటంతో సభను టీపీసీసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవంతం చేసింది. ఈ సభలో సోనియాగాంధీ ఉద్వేగభరిత ప్రసంగించారు. ఆమె ప్రసంగం ఆ పార్టీ నాయకుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. మంచి ఊపు విూద ఉన్న కాంగ్రెస్ మరోసారి ఏఐసీసీ రాహుల్‌గాంధీ టూర్‌ను ఖరారు చేసింది. ఇదిలా ఉంటే రాహుల్ ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గోనున్నారు. రాష్ట్రంలో ప్రజాఫ్రంట్ పేరుతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌లు కూటమిగా బరిలోకి దిగాయి. దీంతో రాహుల్‌తో పాటు చంద్రబాబు, కూటమిలోని ఇతర పార్టీల నేతలు ప్రచారంలో పాల్గోనున్నారు.
రాహుల్ పర్యటన ఇలా..
రాహుల్ 28, 29 తేదీల్లో తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 28న ఉదయం కొడంగల్, మధ్యాహ్నం గజ్వేల్‌లో రాహుల్ రోడ్ షోలో పాల్గొంటారు. 28న సాయంత్రం ఖమ్మంలో రాహుల్, చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. 28న రాత్రి హైదరాబాద్‌లో రాహుల్, చంద్రబాబు రోడ్‌షో నిర్వహించనున్నారు. 29న ఉదయం తాండూర్, మధ్యాహ్నం ఆర్మూరులో రాహుల్ బహిరంగ సభల్లో పాల్గోనున్నారు.అ దేవిధంగా 29 సాయంత్రం భూపాలపల్లి సభల్లో పాల్గొననున్న రాహుల్.. అనంతరం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
ప్రచార వేగాన్ని పెంచిన.. కాంగ్రెస్ పార్ట




