ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధే జర్నలిజం
నిజామాబాద్, జూలై 29 (జనంసాక్షి) : నిజామా బాద్ నగరంలోని స్థానిక విజయలక్ష్మి గార్డెన్‌లో జర్నలిజం నైతిక విలువలపై సదస్సు కార్యక్రమా నికి ముఖ్య అతిథిగా మంత్రి పి.సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనీల్, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఎమ్యెల్యే ధర్మపురి శ్రీనివాస్ గౌరవ అతిథిలుగా ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర ప్రధాన కార్య దర్శి నరేందర్ రెడ్డి, టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారా యణ ఐజేయూ కార్యవర్గ సభ్యులు కె. సత్యనారా యణ హాజరై జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం నిర్వ హించారు. అనంతరం డీఎస్. మాట్లాడుతూ ప్రజ లకు ప్రభుత్వానికి మధ్య వారధి, జర్నలిజం అని. జర్నలిస్టులు వాస్తవాలను వెల్లడించాలని నిష్పక్షపా తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. నిజామా బాద్ జిల్లాలోని నగరంతో పాటు అన్ని మండ లాలో పనిచేసే జర్నలిస్టులకు తనవంతు సహాయ సహకారాలు ఎళ్ల వేళలా ఉంటా యని తెలిపారు. తదుపరి భారీ నీటిపారుదల శాఖా మంత్రి పి. సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రజల దృష్టికి ప్రజల అవసరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేది జర్నలిస్టులు అని కొనియాడారు. అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రా నిక్ మీడియా వాస్తవాలను మాత్రమే ప్రజలకు అందించాలని అంతేకాని వాస్తవాలను వక్రీకరిం చవద్దు అని సూచించారు. తదుపరి ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ మాట్లాడుతూ జర్నలిజం అంటే అవినీతి, అన్యాయానికి వెలికితీసే వాచ్ డాగ్ అని అభివర్ణించారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్ని కైన జిల్లా కమిటి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంగిరేకుల సాయిలు, కార్యదర్శి మల్లెపూల లింబాద్రి నూతన కమిటీి సభ్యులు జిల్లాలోని ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనారు.