ప్రజలకు మేలు కోసం అనేక పథకాలు

వాటితో లబ్ది పొందాలన్న మంత్రి పోచారం
నిజామాబాద్‌,సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి): ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతోనే సిఎం కెసిఆర్‌ అన్ని వర్గాలకు పథకాలను ప్రకటించి అమలు చేస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పేద ప్రజల కళ్లలో ఆనందం కోసమే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. అర్హులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లక్ష రూపాయల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే రుణాలు అందజేస్తామన్నారు.  ప్రతి పైసా ప్రజలకు చెందాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని అన్నారు. ప్రచారంలో భాగంగా ఆయన తనను కలసిన వారితో మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శమన్నారు. గ్రామాల్లో కార్యకర్తలు ప్రధానంగా ఇవే ప్రచారం చేయాలన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మంత్రి పోచారానికి మద్దతు ప్రకటించారు.  డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను నిర్మించి విడతల వారీగా అందజేస్తామన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేస్తామని నిర్ణయించుకొని మంత్రి పోచారానికి మద్దతు పలికారు. వివిధ పార్టీలకు చెందిన గ్రామ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.