Tuesday, 3 November 2026

7 నుంచి టెన్నిస్‌ పోటీలు

ఏలూరు,మార్చి3(జ‌నంసాక్షి): ఈనెలఏడు నుంచి 14 వరకు అంతర్జాతీయ టెన్నిస్‌ టోర్నమెంట్‌ను నిర్వహించనున్నారు. సిఫి టెక్నాలజీస్‌ సహకారంతో వీటిఆని నిర్వహిస్తున్నట్లు భీమవరం కాస్మోపాలిటన్‌ క్లబ్‌ అధ్యక్షుడు గోకరాజు రామరాజు తెలిపారు.  వివిధ రాష్టాల్రనుంచే కాకుండా ఇతర దేశాలకు చెందిన క్రీడాకారులు కూడా వస్తున్నట్లు చెప్పారు. వారిని ఎయిర్‌పోర్ట్‌ నుంచి నేరుగా ఇక్కడకు తీసుకుని వచ్చేలా ఏర్పాట్లు చేశామన్నారు. టోర్నమెంట్‌ విజేతకు పదివేల డాలర్లు నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పిఫితో పాటు క్లబ్‌ సభ్యులందరూ తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారని చెప్పారు. సభ్యుల సహకారంతోనే 30 యేళ్లుగా ఈ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర విద్యా శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు టోర్నమెంట్‌ను ప్రారంభిస్తారని ముగింపు కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ నందూరి సాంబశివరావు విచ్చేస్తారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *