Tuesday, 3 November 2026

ప్రజల ఆకాంక్షల మేరకే మహాకూటమి

– కేసీఆర్‌ పాలనలో ప్రజలు ఇబ్బందులెదుర్కొన్నారు
– నాలుగేళ్లలో గుర్తుకురాని కేసులు.. ఎన్నికలప్పుడే గుర్తుకొస్తాయా?
– విలేకరుల సమావేశంలో టీడీపీ నేత దుర్గా ప్రసాద్‌
హైదరాబాద్‌, సెప్టెంబర్‌28(జ‌నంసాక్షి ) : ప్రజల ఆకాంక్షల మేరకు మహాకూటమి ఏర్పాటవుతుందని, టీఆర్‌ఎస్‌ను హంతమొందించేందుకు మహాకూటమికి ప్రజలు మద్దతుగా నిలుస్తారని టీటీడీపీ నేత, అధికార ప్రతినిధి దుర్గా ప్రసాద్‌ అన్నారు. శుక్రవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. 2009లో తెలుగుదేశంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎందుకు పొత్తు పెట్టుకుందో చెప్పాలన్నారు. నాలుగేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర ఫలాలు ప్రజలకు అందలేదని విమర్శించారు. ఎన్టీఆర్‌ పేరు పెట్టుకున్న కేటీఆర్‌ తెలుగుదేశాన్ని తెలంగాణలో లేకుండా చేయాలని చూస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజల ఆకాంక్ష మేరకే
మహాకూటమి ఏర్పాటు జరుగుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ టీడీపీ పొత్తును ప్రజలే కోరుకున్నారని దుర్గా ప్రసాద్‌ పేర్కొన్నారు. కేసీఆర్‌ పరిపాలనతో సమాజం ఇబ్బంది పడుతోందని దుర్గా ప్రసాద్‌ విమర్శించారు. కేటీఆర్‌ తెలుగుదేశం అంటే భయపడకపోతే.. టీడీపీ గురించి రోజూ ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కవిూషన్ల కోసమే ప్రాజక్టుల రీ డిజైన్‌కు శ్రీకారం చుట్టారని విమర్శించారు. ప్రతిపక్షాల విూద దాడి చేయటమే టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. నాలుగేళ్ళల్లో గుర్తుకురాని కేసులు ఎన్నికలప్పుడే ఎందుకు భయటకు తీస్తున్నారని దుర్గా ప్రసాద్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ కేంద్రంతో కుమ్మకై .. ప్రతిపక్షాల విూద కేసులు పెడుతోందని, కేసీఆర్‌ ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్‌ చేసి కేసులు పెడుతున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి సంప్రదాయం కాదని దుర్గా ప్రసాద్‌ వ్యాఖ్యానించారు.