Tuesday, 3 November 2026

ప్రజల ఆదరణ మరచిపోలేను

ప్రచారంలో మంత్రి పద్మారావు

హైదరాబాద్‌,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఏ బస్తీకి వెళ్లినా.. ప్రజలు స్వచ్ఛందంగా సన్మానాలు చేసి మంగళ హరతి పడుతున్నారని వారి రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని మంత్రి పద్మారావు అన్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో అనేక అభివృద్ది పనులు చేపట్టడం జరిగిందని ప్రజలు స్వచ్ఛందంగా తమకు ఓటు గెలిపిస్తామని హవిూ ఇస్తున్నారని అన్నారు. ఏ కాలనీకి వెళ్లినా.. బస్తీకి వెళ్లినా.. టీఆర్‌ఎస్‌ పార్టీకే ఓటు వేస్తామని తెలుపుతున్నారు అన్నారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్‌ లోని మైలార్‌ గడ్డ, దూద్‌ బావి, దాదర్‌ కంపౌండ్‌ పలు బస్తీలలో 6వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్ళి కారు గుర్తు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి ఒక్కరన్న ప్రభుత్వ పథకాలు పొందిన వారు ఉన్నారని మంత్రి పద్మారావు తెలిపారు.