ప్రజల ఆశలను వమ్ము చేసిన బిజెపి పాలకులు
ఇచ్చిన హావిూల మేరకు సాగని పాలన
దినదినగండంగా నాలుగున్నరేళ్ల కాలం
మళ్లీ ప్రత్యామ్నాయం వైపు ప్రజల చూపు
న్యూఢిల్లీ,నవంబర్2(జనంసాక్షి): ప్రజలు ఎన్నో ఆశలతో బిజెపిని అందలం ఎక్కిస్తే అందుకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో హావిూలు నెరవేరిన దాఖలాలు లేవు. ప్రజలు బాగుపడుతున్నారా లేదా అన్నది కింది స్థాయిలో నేతలు చూడడం లేదు. పైగా మోడీ అభివృద్ది అంటూ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ నవభారతాన్ని ఆవిష్కరిస్తామని, పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తామని అంటున్న మాటలు నిజం కావడం లేదని అంతర్గత వేదికల ద్వారా తెలియ చేయాలి. ఇచ్చిన హావిూల మేరకు పాలకులు అందుకు తగ్గట్లుగా ప్రజలకు సేవ చేయగలగాలి. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయ్యే 2022 నాటికి సరికొత్తగా వెలుగు లీనుతూ ఉన్నత శిఖరాలను అందుకునే దేశంగా అవతరించాలన్న ప్రధాని సంకల్పాన్ని నిజం చేసేలా కార్యాచరణ కూడా చేసుకోవాలి. పేదలు, అణగారిన
వర్గాలు తమ జీవితాలను మెరుగ్గా తీర్చిదిద్దుకునే దేశాన్ని తయారు ఏయాలన్న సంకల్పం నెరవేరాలంటే పథం మారాలి. బిజెపిని నమ్మి ఓటేశారని స్పష్టంగా గుర్తించాలి. ఈ దేశంలో పేదలు తమకోసం ఏదో ఒకటి జరగాలని,మార్పు రావాలని కోరుకుంటున్నారు. తమకు కొత్త అవకాశాలు రావాలని, తమ బతుకులు బాగు పడాలని చూస్తున్నారు. దీనిని ప్రతిసారీ ఎన్నికల ఫలితాల రూపంలో తెలియ చేస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. వాగ్దానాలు చేయడం వాటిని మరవడం సరికాదు. అందువల్ల ప్రజల ఆకాంక్షలను నిరంతరం నెమరువేసుకునేలా నాయకులు ఉండాలి. ఎన్నికల్లో ప్రజాతీర్పునకు అనుగుణంగా పాలకులు నడుచుకుని ఉంటే పేదల ఆకాంక్షలు నెరవేరడానికి ఇంతకాలం పట్టేది కాదు. ఇచ్చిన హావిూలు నెరవేర్చడం అన్నది కష్టతరమే కాకుండా క్లిష్టం కూడా. దేశ భవిష్యత్తు నిర్మాణంలో పేదలకు ఎంత అధికంగా అవకాశం లభిస్తే దేశం అంత వేగంగా ముందుకెళ్తుంది. పేదలకు విద్య లభిస్తే సమాజంలో భారీ మార్పులు వస్తాయి. వారికి ఎంత ఎక్కువ అవకాశాలు కల్పిస్తే దేశానికి అంత ఎక్కువ చేసి చూపిస్తారు. దేశంలో మధ్యతరగతి ప్రజలు చాలాభారం భరించాల్సి వస్తోంది. మొత్తం ఆర్థిక భారం మధ్య తరగతి వారే భరిస్తున్నారు. వారిపై భారం తగ్గాలి. ఒకసారి పేదలకు వారి భారాన్ని ఎత్తుకొనే శక్తి వస్తే దేశంలోని మధ్యతరగతి ప్రజలపై ఉన్న భారం దానంతట అదే తగ్గిపోతుంది. పేదల కొత్త శక్తి, మధ్య తరగతి కలలను సమ్మిళితం చేస్తే ఈ దేశం కొత్త ఎత్తులకు వెళ్లకుండా ఎవ్వరూ ఆపలేరని పదేపదే అంటున్న ప్రధాని మోడీ మాటలకు ఆచారణ రూపం రావాలి. ఇటీవలి పెద్దనోట్ల రద్దు కారణంగా ఎందరనో పేదమధ్య తరగతి ప్రజలు ఇక్కట్ల పాలయ్యారు. ఇవి ఇక్కట్లే కాదు. వారి ఆర్థికప్రగతిని కుంగదీసింది. దీనిపై అంచనా వేయలేదు. ఆ తరవాత ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. మన దేశంలో ఎన్నో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ప్రజలు తమ భావోద్వే గాలను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో తమ తీర్పు ద్వారా ఆకాంక్షలు వెల్లడిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటులో ఉన్న ఆసక్తి ప్రజల ఆకాంక్షలను తీర్చడంలో కూడా ఉండాలి. బిజెపిని ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా నిలబెట్టారు. ఇంతకు మించిన త్యాగం ఇక ప్రజలు చేయలేరేమో. కాబట్టి మోడీ తన ఆలోచనలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ చేసి ముందుకు సాగాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడం ద్వారా సాగాలే తప్ప కొత్త సమస్యలు సృష్టించరాదు. బ్యాంకుల్లో వడ్డనలను రద్దు చేయడం ద్వారా ప్రజలకు వాటిని మరింత చేరువ చేయాలి. వాటిని సర్వీస్ సెక్టార్ కిందకు తీసుకుని రావాలి. ఇలాంటివన్నీ విశ్లేషించుకుంటేనే ముందుకు సాగుతారు. దేశానికి ఎంతోకొంత చేయాలన్న సంకల్పంతో ముందుకెళ్లాలి. 125 కోట్ల మంది ప్రజలను కలుపుకొని నవభారత్ రూపకల్పనకు ముందుకు కదలాలి. 2022 నాటికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లవుతున్న సందర్భంగా దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లే సంకల్పంతో ముందుకెళ్లాలన్న సంకల్పానికి కార్యాచరణ ఉండాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో గమనించాలి. లోపాలుంటే సరిదిద్దుకొని ముందడుగు వేస్తామని సంకల్పం తీసుకోవాలి. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. ప్రధాని మోడీ ప్రజల సమస్యలను తెలుసుకుని ముందుకు సాగాల్సి ఉంది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్దేశించి ముందుకు నడిస్తేనే చెప్పిన మాటలకు, ఇచ్చిన హావిూలకు విలువ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు, ప్రభుత్వ ఏర్పాటు సర్వసాధారణం అయినా ప్రజలంతా తమకు ఏదొ బాగు జరగాలన్న లక్ష్యంతో ఓటేస్తారు. ఎవరో ఒకరిని గద్దెనెక్కించేందుకు కాదని గుర్తు చేసుకోవాలి. బిజెపి మాత్రమే ఏదైనా చేయగలదన్న నమ్మకంతో ఉన్న ప్రజల ఆశలు వమ్ము అవుతున్న వేళ మేల్కోక పోతే పుట్టి మునగడం ఖాయం.