మేడ్చెల్ సభలో కోమటిరెడ్డి
హైదరాబాద్,నవంబర్23(జనంసాక్షి): ప్రజల కష్టాలు తీరలేదు కానీ కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నారని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ దగ్గర కాళేశ్వరం, మిషన్ భగీరథ కవిూషన్ల సొమ్ము ఉందని, కేసీఆర్ ఎంత డబ్బు పంచినా.. కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. వంద సీట్లు గెలుస్తానన్న కేసీఆర్..ఓడిపోతే ఫాంహౌస్‌కు పోతానంటున్నారు. 15 రోజుల ముందే తెలంగాణ తీర్పు కేసీఆర్‌కు అర్థమైంది. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను కేసీఆర్ కాపీ కొడుతున్నారు అని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చాక ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హావిూ ఇచ్చారు. అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ ఆదుకోలేదన్నారు. అమరవీరుల స్థూపం నిర్మిస్తానన్న కేసీఆర్ ఆ సంగతి మర్చిపోయారని విమర్శించారు. కేసీఆర్‌ను ప్రశ్నించినందుకు అసెంబ్లీ నుంచి నన్ను బహిష్కరించారని ఆయన చెప్పారు.




