ప్రజల సమస్యలు తెలుసుద్ర తూప్రాకోవడానికి పల్లెనిన్

( జనంసాక్షి) జూన్ 11 :: ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి తాను పల్లెనిద్ర చేస్తున్నట్లు మెదక్ న్జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ తెలిపారు రాత్రి మనోహరాబాద్ మండలం వెంకటాపూర్ అగ్రరం గ్రామంలో పల్లె నిద్ర చేసిన సందర్భంగా గ్రామస్తులతో ఆమె మాట్లాడారు పెద్దలు చెప్పిన సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు  ఉదయాన్నే లేచి గ్రామంలోని పలు వీధులలో పరిసరాలను పర్యవేక్షించి గ్రామంలోని ప్రజలతో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం గురించి  మరియు వారికి స్వచ్ఛత గురించి  తెలియజేసి  శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమములో ఎంపీడీవో కృష్ణ మూర్తి  వైస్ ఎంపీపీ విఠల్ రెడ్డి , ఎంపీవో లక్ష్మీ నర్సింలు  ఏపీఓ ఆదినారాయణ  సర్పంచ్ రేణుక ఆంజనేయులు ఉప సర్పంచ్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.