– మండలం నుంచి రాష్ట్రస్థాయి ప్రణాళిక
– వైద్య సేవలపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,ఫిబ్రవరి 20(జనంసాక్షి): ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు ఎన్ని నిధులైనా వెచ్చస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆయన అధకారులను ఆదేశించారు. శనివారం ఆయన వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… పీహెచ్సీ నుంచి నిమ్స్ వరకు అభివృద్ధిపై సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో మరో 4 వెయ్యి పడకల ఆస్పత్రులు నిర్మించాలన్నారు. ఉప్పల్-ఎల్బీనగర్, మల్కాజ్గిరి-కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్-కూకట్పల్లి, శేరిలింగంపల్లి-రాజేంద్రనగర్‌ల్లో ఆస్పత్రులు నిర్మించాలని, వరంగల్ ఎంజీఎంలో మహిళా శిశు సంక్షేమం కోసం టవర్లు నిర్మాణం జరగాలన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల మాదిరిగా హైదరాబాద్‌లో మరో 4 వెయ్యి పడకల ఆసుపత్రులను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలిపారు. గతంలోనే ఆయన దీనిపై ప్రకటన చేశారు. అలాగే వరంగల్ సెంట్రల్ జైల్ ప్రాంతంలో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తామన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు ఎంత బడ్జెట్ అయినా కెటాయిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రైవేటు వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులు మెరుగ్గా తయారవ్వాలని ఆయన కోరారు. గ్రావిూణ ప్రాంతాల్లో పనిచేసే వైద్య సిబ్బందికి అదనపు వేతనం చెల్లిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజావైద్యంపై అధ్యయనానికి త్వరలో మంత్రుల బృందం తమిళనాడులో సందర్శించనున్నట్లు తెలిపారు. 108, 104 సేవలు బలోపేతం చేసేందుకు అవసరమైన విధానాన్ని రూపొందించనన్నట్లు కేసీఆర్ తెలిపారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య శాఖకు బడ్జెట్లో నిధుల కేటాయింపుపై సవిూక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. కింగ్‌కోఠి ఆసుపత్రి స్థాయిని పెంచి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామన్నారు. వరంగల్ ఎంజీఎం ప్రస్తుత భవనంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్పేర్ కోసం ప్రత్యేక టవర్స్ నిర్మిస్తామని వెల్లడించారు. హెల్త్ యూనివర్సిటీకి అనుబంధంగా మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి నిర్మిస్తామని పేర్కొన్నారు. వరంగల్ హెల్త్ యూనివర్సిటీ, మెడికల్ కాలేజీ, మల్టీస్పెషాలిటి ఆసుపత్రిని ప్రస్తుతం ఉన్న సెంట్రల్ జైలు ప్రాంతంలో నిర్మిస్తామని తెలిపారు. కరీంనగర్, ఖమ్మం, సూర్యాపేట అప్‌గ్రేడ్ చేసి కొత్త భవనాలు నిర్మిస్తామన్నారు. హైవేల వెంట ట్రామా కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ జిల్లాలో నాలుగు చోట్ల, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 40 చోట్ల ఎంఆర్ఐ, సిటీస్కాన్, అల్టాస్రౌండ్, మెమోగ్రమి ఏర్పాటు చేస్తామన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే వైద్యులకు అదనపు వేతనం ఇస్తామన్నారు. వైద్యులు పీహెచ్‌సీల్లో పనిచేసే ప్రాంతాల్లోనే నివాసం ఉండాలనే నిబంధనలు తొలగిస్తామన్నారు. ప్రభుత్వ వైద్యశాలలకు అవసరమైన సౌకర్యాలను సమకూరుస్తామని తెలిపారు.ప్రైవేటు ఆసుపత్రులకన్నా మంచిగా ప్రభుత్వ ఆసుపత్రులు తయారు చేస్తామన్నారు. ప్రజా వైద్యం మెరుగ్గా ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఆరోగ్యశాఖ మంత్రి నేతృత్వంలో బృందం పర్యటిస్తుందని చెప్పారు. 104, 108 సేవలను మరింత బలోపేతానికి అనువైన విధానం రూపొందిస్తామని వెల్లడించారు. హైవేలపై పెట్రోలింగ్ వాహనాలతో 108, 104 అనుసంధానం చేస్తామన్నారు. ఇదిలావుంటే బడ్జెట్‌కు సంబంధించి ఆయా శాఖల అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ వరుస సవిూక్షలు జరుపుతున్నారు. శాఖల వారీగా ఏయే అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలనే అంశంపై సీఎం ఆయా శాఖల మంత్రులు, అధికారులతో చర్చిస్తున్నారు. తాజాగా పంచాయతీరాజ్ ,గ్రావిూణాభివృద్ధి శాఖ అధికారులతో సీఎం సవిూక్షించారు. సమావేశానికి మంత్రులు ఈటెల రాజేందర్, కేటీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు సంబంధిత అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ఉందు వైద్య ఆరోగ్య శాఖపై సీఎం సవిూక్ష నిర్వహించారు.





