ఢిల్లీలో అవినీతి పెరిగిపోయింది : ఢిల్లీ ఓటర్లు
న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 07 జనంసాక్షి : ఆప్, బీజేపీ, కాంగ్రెస్ ఏ పార్టీఅయినా కానీ ప్రజా సంక్షేమానికి పాటుపడుతూ అవినీతిని నిరోధించేందుకు కృషి చేసే ప్రభుత్వమే ఢిల్లీని పాలించాలని ఢిల్లీ ఓటర్లు కోరుకుంటున్నారు. దేశ రాజధానిలో అవినీతి పెరిగిపోయిందని, కొత్త ప్రభుత్వం అవినీతి నిర్మూలనకు కృషి చేయాలని ప్రజలు ఆశిస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మూత పడిన పరిశ్రమలను తిరిగి తెరిపించాని ఓటర్లు కోరుతున్నారు.




