సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ
బాధితులకు సర్కార్ అండగా ఉంటుందన్న సోమిరెడ్డి
నెల్లూరు,జూన్5(జనం సాక్షి):రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సిఫార్సుతో 23 మంది బాధితులకు సీఎం సహాయనిధి నుంచి రూ.46,51,208 ఆర్థిక సాయం అందింది. పొదలకూరు మండలం పొదలకూరు నరసారెడ్డి కాలనీకి చెందిన పొన్నూరి శివరామకృష్ణకు రూ.1,45,846, సూరాయపాళేనికి చెందిన పుచ్చా రమ్యకృష్ణకు రూ.30,000, పాలకీర్తి అంజమ్మకు రూ.27,000, నల్లపాళేనికి చెందిన కాకూరు సుబ్బమ్మకు రూ.60,000 మంజూరు అయ్యాయి. బాధితులకు మంత్రి సోమిరెడ్డి స్వయంగా చెక్కులు అందచేశారు. పేదలకు ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కొత్తగా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల పింఛన్లు మంజూరు చేశామని, .అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తున్నామని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 1747 మందికి పింఛన్ల మంజూరు జరిగిందన్నారు. .మరో 800 మందికి కూడా మంజూరు చేస్తామని మంత్రి హావిూ ఇచ్చారు.
—————————-