చౌటుప్పల్ : చౌటుప్పల్ మండలం స్వాములవారి లింగోటం గ్రామంలోని ప్రతిష్ట ఇండస్ట్రీస్‌ను ఇక్రీశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ విలియం థార్ సందర్శించారు. పరిశ్రమలో ఏర్పాటు చేసిన అర్గానిక్ ఫర్టిలైజర్ గ్రాన్యులేషన్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్గానిక్ ఫర్టిలైజర్స్ వినియోగాలకు సంబంధించిన విషయాలపై సెమినార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎస్‌ఐఆర్ ఛైర్మన్ డాక్టర్ వీఎస్ రామమూర్తి , ఆచార్య ఎన్టీరంగా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏ. పద్మరాజ్, భారత ప్రభుత్వ టీడీబీ సెక్రరిటీ హరకేశ్ మిటల్, ఆంధ్రబ్యాంకు జనరల్ మేనేజర్ ప్రసన్న ఫణికర్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.




