Tuesday, 3 November 2026

గ్లోకెం ఔషధ పరిశ్రమలో అదుపులోకి వచ్చిన మంటలు

పరవాడ : విశాఖ జిల్లా పరవాడ జవహర్‌లాల్‌ నెహ్రూ ఫార్మాసిటీలో గల గ్లోకెం ఔషధ పరిశ్రమలో గురువారం సాయంత్రం చెలరేగిన మంటలు శుక్రవారం తెల్లవారుజామున 3గంటలకు అదుపులోకి వచ్చాయి. జిల్లాలోని 11 శకటాలతో అగ్నిమాపక సిబ్బంది 11 గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా పోలీస్‌కమినర్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లా అగ్నిమాపక శాఖాధికారి జ్ఞాన సుందరరావు మాట్లాడుతూ పరిశ్రమకు అగ్నిమాపకశాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని తెలిపారు. ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యం అగ్నిమాపకశాఖ అనుమతుల కోసం ఎటువంటి దరఖాస్థులు చేసుకోలేదన్నారు. గతంలో పరిశ్రమ యాజమాన్యాన్ని రెండుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదన్నారు. పరిశ్రమలో ఫెర్‌ హైడ్రం సిస్టం లేకపోవటంతోనే ప్రమాద తీవ్రత పెరిగిందాన్నారు. అలాగే పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు శాఖాధికారులు, పరిశ్రమల శాఖ అధికారులు కంపెనీని సందర్శించారరు. ప్రమాద నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *