Tuesday, 3 November 2026

ప్రతీ విద్యార్థి ఓ మొక్కను నాటాలి

అనంతపురం,మార్చి2(జ‌నంసాక్షి): ప్రతీ విద్యార్థి ఓ మొక్కను నాటడంతో పాటు కచ్చితంగా దాన్ని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బి.కె.పార్థసారథి పిలుపునిచ్చారు. విద్యార్థులు ఇప్పటి నుంచి పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులను చూసి ఇతరులు కూడా ముందుకు వస్తారని అన్నారు. తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో రూపొందించిన ‘నీరు-చెట్టు’ చితన్య పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నీరు- చెట్టు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్నారన్నారు. యువత భాగస్వామ్యం ఉంటే కచ్చితంగా విజయవంతం అవుతుందన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలల్లో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో యువతలో చితన్యం నింపాలన్నారు. యువతను భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత టీఎన్‌ఎస్‌ఎఫ్‌ భుజస్కందాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా ఉపాధ్యక్షులు శ్రీధర్‌చౌదరి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు తమ్మినేని పవన్‌కుమార్‌, చంద్రదండు జిల్లా అధ్యక్షులు రాజారావు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు రవితేజ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *