Wednesday, 4 November 2026

ప్రత్యక్ష పోరాటలకు రెడీ అవుతున్న కోదండరామ్‌

హైదరాబాద్‌,మే26(జ‌నంసాక్షి): పలు సమస్యలపై పోరాటం చేస్తున్న తెలంగాణ ఐకాస ఇక రాజకీయ పార్టీగా అవతారమెత్తిన తరవాత తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ అవతరించింది. దీంతో పార్టీతో పాటు ఐకాస కూడా ప్రత్యక్ష పోరాటానికి సిద్దం అవుతోంది. నాడు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన ఐకాస.. ప్రస్తుతం తెలంగాణ ప్రజా సమస్యలపై పోరాడేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నది. తాజాగా భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనకి సిద్దం అవుతోంది. అలాగే విద్య,ధర్నా చౌక్‌ తదితర అంశానలు కూడా చేపట్టింది. రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించే క్రమంలో భూనిర్వాసితుల చట్టం-2013 ప్రకారం ప్రజాస్వామ్యబద్దంగా అమలు జరపాలని తెలంగాణ ఐకాస డిమాండ్‌ చేస్తోంది. రాష్ట్రంలో చేపడుతున్న విద్యుత్తు, సాగునీటి ప్రాజెక్టులు శాస్త్రీయంగా లేకపోవడంతో వేలకోట్ల ప్రజాధనం వృథా కావడమే కాకుండా రైతులు పెద్దఎత్తున భూములను కోల్పోతున్నారని అన్నారు. సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం చేస్తామని ఇందుకు గ్రావిూణ స్థాయి నుంచి కార్యచరణకు రూపకల్పన చేయాల్సిన అవసరముందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అవకాశవాద రాజకీయాలను వదిలి ప్రజా సంక్షేమంకోసం కృషి చేయాలని సూచించారు. ఇందుకోసం గ్రామస్థాయిలో పోరాటాలకు రంగం సిద్దం చేస్తోంది.