ప్రత్యేక¬దా కోరుతూ నిరసనలు

గుంటూరు,జ‌నం సాక్షి ): రాష్టాన్రికి ప్రత్యేక ¬దా ఇవ్వాలని కోరుతూ గుంటూరు జిల్లా బాపట్ల సూర్యలంక తీరంలో తెలుగు యువత ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు. సముద్ర తీరం ఒడ్డున ఇసుకలో సగం వరకు కూరుకుపోయి తెలుగు యువత నాయకులు నిరసన ప్రకటించారు. ప్రధాని మోదీ వల్ల నవ్యాంధ్ర పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిందంటూ తెలుగు యువత నాయకులు ఈ నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధాని రాజధానికి తెచ్చిన మట్టిని సముద్రంలో కలిపారు. ఆంధ్రప్రదేశ్‌ యువత భవిష్యత్తును మోదీ నాశనం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. మోదీ హావిూల వైఫల్యంపై తిరుపతిలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన నిరసన సభకు తెలుగు యువత నాయకులు సంఘీభావం తెలిపారు. తెలుగు యువత జిల్లా కార్యదర్శి రావిపాటి సాయి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

——-

తాజావార్తలు