రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

నెల్లూరు,జ‌నం సాక్షి ): రైతుల వద్ద ఎంత ధాన్యం ఉన్నా కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. వ్యవసాయన్ని లాభసాటిగా చేయటానికి ఆధునిక పద్ధతులను వినియోగిస్తున్నామని తెలిపారు. సోమవారం బోగోలు తహశీల్దార్‌ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తక్షణం చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రత్తిపాటి అన్నారు. దళారులను ఆశ్రయించవద్దని రైతులకు సూచించారు.

తాజావార్తలు