Tuesday, 3 November 2026

జాట్‌ ఆందోళనలో సీబీఐ విచారణ

19brk-JATహరియాణా: విద్యా, ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ జాట్‌ వర్గీయులు చేసిన ఆందోళనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంపై సీబీఐ విచారణ జరపాలని హరియాణా ప్రభుత్వం సిఫార్సు చేసింది. ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అభిమన్యు ఇంటిపై దాడి, రోహతక్‌ జిల్లాలో జాట్లు చేసిన అల్లర్లపై విచారణ చేయాలని ప్రభుత్వం సీబీఐని కోరింది. రాజకీయ, నేరపూరితమైన కోణాల్లో విచారణ చేయాలని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ ఇంటిపై జరిగిన దాడి గురించి పరిశీలించాలని ప్రభుత్వం కోరింది.

జాట్‌ వర్గీయుల ఆందోళన కారణంగా ఎక్కువగా రోహ్‌తక్‌ జిల్లాలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ ఆందోళనల్లో మొత్తం 30 మంది వరకూ మృత్యువాత పడ్డారు. పలు ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు దెబ్బతిన్నాయన్నారు. ఫిబ్రవరి 19న మంత్రి ఇంటికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో ఇంట్లో 9 మంది ఉన్నారు. దీనిపై మంత్రి మాట్లాడుతూ సీబీఐ విచారణను స్వాగతించారు. నిజానిజాలు ఏమిటో అందరికీ తెలియాలని, తన కుటుంబాన్నంతటినీ అంతం చేయడానికి పన్నిన రాజకీయ కుట్రగా తాను భావిస్తున్నానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *