ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో కీ.శే జయశంకర్ సార్ పాత్ర మరవలేనిదని : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ అనిఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ కొనియాడారు తెలంగాణ సిద్ధాంతకర్త కీ.శే ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 11వ వర్దంతి సందర్బంగా చంపాపేటలో తెలంగాణ ఉద్యమకారుల ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ పాల్గొని స్వర్గీయ జయశంకర్ మాస్టార్ విగ్రహనికి పూలమాల వేసీ ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్బంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ జయశంకర్ సార్ జయంతి, వర్ధంతిలను ఘనంగా నిర్వహించడం, ఆయన సేవలను స్మరించుకోవడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ప్రొఫెసర్ గా, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ అని కొనియాడారు. జయశంకర్ సార్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపారని… ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరవలేనిదని తెలిపారు . నివాళులు అర్పించిన వారిలో రామ్ లక్ష్మణ్,బైగళ్ల రాము, హుస్సేన్ యాదవ్,నాగభూషణం, సాయి ఈశ్వర్ గుప్త , గౌస్ తదితరులున్నారు .