ప్రత్యేక హోదా కోరుతూ దీక్షలు

ఏలూరు,మే22( జ‌నం సాక్షి ): ప్రత్యేక హోదా సాధన కోసం సిపిఎం ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు.  పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో ఈ దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రానికి  ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాడతామన్నారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి రాష్ట్రానికి  ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అనే నినాదంతో అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో మంగళవారం నిరసన దీక్ష ప్రారంభమైంది. ఈ దీక్షలో నాయకులు మాట్లాడుతూ… ప్రత్యేక హౌదా ఆంధ్రుల హక్కు అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఇప్పటికైనా మొండి వైఖరి వీడీ విశాఖకు రైల్వేజోన్‌, రాష్టాన్రికి ప్రత్యేక ¬దా, విభజన హావిూలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణ స్వామి ఎఐవైఎఫ్‌ దుర్గాప్రసాద్‌, సిపిఐ నాయకులు చలపతి మౌలాలి, వైసిపి నాయకులు పాల్గన్నారు.