Friday, 6 November 2026

భాగ్యరెడ్డి వర్మకు ఘనంగా నివాళి

హైదరాబాద్‌,మే22(జ‌నం సాక్షి ): హైదరాబాద్‌ కేంద్రంగా దళిత ఉద్యమానికి దారులేసిన తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డివర్మ 130వ జయంతిని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించింది. దళిత జనోద్దరణ కోసం ఉద్యమాలు, దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన సేవలను స్మరించుకున్నారు. జోగిని, దేవదాసి వంటి దురాచారాలను రూపుమాపేందుకు ఉద్యమించారని.. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడ్డారని సీఎం గుర్తు చేసుకున్నారు. ఉద్యమకారుడిగా, హక్కుల కార్యకర్తగా, రచయితగా, పాత్రికేయుడిగా, సంఘసంస్కర్తగా బహుముఖ ప్రజ్ఞను చాటిన భాగ్యరెడ్డి వర్మ నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.