ప్రత్యేక హోదా పోరులో అన్ని పార్టీలు విఫలం: బివి
గుంటూరు,జూన్11(జనం సాక్షి): ప్రస్తుత పార్టీలతో ఎపి రాష్ట్రానికి ఉపయోగం లేదని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. ఏ పార్టీకూడా ప్రాజ ప్రయోజనాల కోసం పపోరాడడం లేదన్నారు. సోమవారం ఆయన గుంటూరులోని చెంచుపేటలో నిర్మించిన పరుచూరి నాగేశ్వరరావు స్మారక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు రాష్ట్రానికి అవసరమని అన్నారు. ఎపికి ప్రత్యేక ¬దాను నిరాకరిస్తూ బిజెపి నవ్యఆంధ్రను పురిట్లోనే అనారోగ్యం పాలుచేసిందని విమర్శించారు. నాలుగు సంవత్సరాలు కేంద్రంతో అంటకాగిన టిడిపి.. ఈ పాపంలో పాలుపంచుకుందన్నారు. కేంద్రంతో వైసిపి కఠినంగా వ్యవహరించడం లేదని ఆయన అన్నారు. ఇక ఎపిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనమైందని పేర్కొన్నారు. వామపక్షాలు తొలి నుండి ఎపికి ప్రత్యేక ¬దా కోసం పోరాడుతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రస్తుత పార్టీలతో రాష్టాన్రికి ఎటువంటి ఉపయోగం, ప్రయోజనం లేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యామ్నాయ పార్టీలతో కలసిరావాలని పిలుపునిచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ విజయవంతం అవుతున్నారు. మాభావాలకు దగ్గరగా ఉండి అప్పటి పరిస్తుతులను బట్టి జనసేనతో పొత్తును ఆలోచిస్తామని బీవీ రాఘవులు తెలిపారు.