Wednesday, 4 November 2026

ప్రధాని మోడీ నివాసంలో అత్యవసర సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో బీజేపీ నేతలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్ జైట్లీ, సుష్మాస్వరాజ్, రామ్‌లాల్ హాజరయ్యారు. సమావేశంలో ఢిల్లీ ఎన్నికల పోలింగ్, బీహార్ రాజకీయాలతో పాటు ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇప్పటికే అమిత్‌షాతో బీహార్ బీజేపీ అధ్యక్షుడు సుశీల్‌మోడీ సమావేశమై ఆ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై చర్చించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *