న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. 6 గంటల వరకు క్యూలెన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 12,177 కేంద్రాల్లో పోలింగ్ జరిగింది.
ఆయా పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఈవీఏంలలో నిక్షిప్తమై ఉంది. 70 అసెంబ్లీ స్థానాలకు 673 మంది పోటీ చేశారు. వీరిలో 63 మంది మహిళలున్నారు. ఈవీఏంలను భద్రపర్చేందుకు 14 ప్రాంతాల్లో 70 స్ట్రాంగ్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు 63.46 శాతం పోలింగ్ నమోదైంది. 2013 ఎన్నికల్లో 65.60 శాతం పోలింగ్ నమోదైంది. మరికాసేపట్లో పోలింగ్ వివరాలు పూర్తి స్థాయిలో వెలువడనున్నాయి.





