Thursday, 5 November 2026

ప్రధాని మోదీని కలిసిన నేతాజీ కుటుంబసభ్యులు

న్యూఢిల్లీ, అక్డోబర్‌ 14 : ప్రధానమంత్రి నరేంద్రమోదీని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ కుటుంబసభ్యులు బుధవారం ఆయన నివాసంలో కలవనున్నారు. సుమారు 50 మంది ప్రధానమంత్రిని కలుస్తారు. గత నెల 20న మన్‌కీబాత్‌ సందర్భంగా నేతాజీ కుటుంబ సభ్యులను తన నివాసానికి ఆహ్వానిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. అలా చేయడం తనకు గౌరవమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో వారికి ఆహ్వానాలు అందాయి. బోస్‌ మరణం మిస్టరీగా ఉన్న నేపథ్యంలో ఇటీవల పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం బోస్‌కు సంబంధించి తమ దగ్గర ఉన్న రహస్య పత్రాలను విడుదల చేసింది. అయితే కేంద్రం ఆధీనంలో ఉన్న మరికొన్ని రహస్య పత్రాలను బయట పెట్టాల్సిందిగా మోదీని నేతాజీ కుటుంబ సభ్యులు కోరనున్నారు. నేతాజీ బంధువు చంద్రకుమార్‌బోస్‌ మీడియాతో మాట్లాడుతూ 70 ఏళ్లు గడిచిపోయినా ఆయన మరణం నేటికీ రహస్యంగానే ఉందని అన్నారు. భారత దేశం మొదటి ప్రధాని నెహ్రూ నా తండ్రి అమేయనాథ్‌ బోస్‌కు ఒక చీటి ఇచ్చారని 1945 ఆగస్టు 18న సుభాష్‌ చంద్రబోస్‌ మరణించలేదని అందులో రాశారని ఆయన తెలిపారు. మా కుటుంబం మొత్తం దాన్నే విశ్వసిస్తోందని, నేతాజీ అన్నగారైన శరత్‌ చంద్రబోస్‌ కూడా ఆ తేదీని ఒప్పుకోలేదని, కాబట్టి ఇప్పుడు ఆ విషయంపై దర్యాప్తు చేయడానికి ఒక కమిషన్‌ వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *