Thursday, 5 November 2026

గుట్ట అభివృద్ధిపై సమీక్ష

C

– దసరా నుంచి పనులు

– సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,అక్టోబర్‌14(జనంసాక్షి): .

యాదగిరిగుట్ట అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా యాదాద్రి కొత్త నమూనాకు సీఎం అమోదం తెలిపారు. అలాగే దసరా రోజు పనులను ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. వచ్చే దసరా నాటికి యాదాద్రికి ఒక రూపం తీసుకురావాలన్నారు. అలాగే గుట్టపై గర్భగుడి యదాతధంగా ఉంటుందని, ప్రస్తుతం గుట్టపై ఉన్న భవనాలు తొలగించి కొత్త లేఅవుట్‌ ప్రకారం నిర్మాణాలు చేయాలన్నారు. అలాగే వీఐపీల ప్రవేశమార్గం ప్రత్యేకంగా ఉండేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… యాదగిరిగుట్ట ఆలయ ప్రాంగణాన్ని మానవ నిర్మిత అద్భుతంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. యథావిథిగా గర్భగుడి, నమూనాలను సీఎం ఆమోదించారు. దసరా నుంచి పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారు. యాదగిరిగుట్టపై 1.9 ఎకరాల విస్తీర్ణంలో బస్టాండ్‌ నిర్మాణం చేపడతామన్నారు. ప్రధాన ఆలయం చుట్టూ 2.3 ఎకరాల విస్తీర్ణంలో మాడవీధుల నిర్మాణం ఉంటుందని చెప్పారు. ఆలయం తూర్పున 108 అడుగుల ఎత్తున అంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట ఉంటుందని వెల్లడించారు. బ్ర¬త్సవాలు జరిగేందుకు వీలుగా తూర్పుభాగంలో ప్రత్యేకంగా స్థలం ఏర్పాటు ఉంటుందన్నారు. తూర్పుభాగన వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో టెంపుల్‌ సిటీగా అభివృద్ధి చేసే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *