Thursday, 5 November 2026

ప్రపంచ కప్‌లో వండర్‌ ఇంగ్లాండ్‌ ను ఓడించిన బంగ్లా

sportsఅడిలైడ్‌,మార్చి9 : క్రికెట్‌లో సంచలనాలు నమోదవుతాయని మరోమారు నిరూపితమయ్యింది. పటిష్టమైన జట్టుగా ప్రపంచకప్‌లోకి అడుగుపెట్టిన ఇంగ్లాండ్‌ ఇంటిబాట పట్టింది. అనూహ్యంగా బంగ్లా క్వార్టర్స్‌కు చేరింది. క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లండ్‌ ఆశలు ఆవిరయ్యాయి. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా వన్డే ప్రపంచ కప్‌ గెలవని ఇంగ్లండ్‌.. ఒక్కసారైనా ఆ ముచ్చట తీర్చుకోవాలన్న కల కలగానే మిగిలిపోయింది. తాజా ఈవెంట్లో చెత్తగా ఆడిన ఇంగ్లీష్‌ మెన్‌ లీగ్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్కమ్రించారు.ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్‌ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో బంగ్లాదేశ్‌ 15 పరుగుల తేడాతో విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌లో స్థానం సంపాదించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేయగా లక్ష్య ఛేదనలో తడబడిన ఇంగ్లాండ్‌ 48.3 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటై ఇంటిదారి పట్టింది. ఈ విజయంతో పూల్‌-ఎ లో బంగ్లాదేశ్‌ ఏడు పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలవగా..రెండు పాయింట్లతో ఇంగ్లాండ్‌ ఐదో స్థానానికే పరిమితమైంది.  బంగ్లాదేశ్‌తో  చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో ఇంగ్లండ్‌ చతికిలపడింది. బంగ్లా 15 పరుగులతో ఇంగ్లండ్‌ను  చిత్తు చేసింది. దీంతో ఇంగ్లండ్‌ ఇంటిదారి పట్టగా, బంగ్లాదేశ్‌ క్వార్టర్స్‌కు  దూసుకెళ్లింది. ఐదు మ్యాచ్లాడిన ఇంగ్లండ్‌ (2) ఓ మ్యాచ్లో మాత్రమే గెలిచింది. బంగ్లా 7 పాయింట్లతో (3 విజయాలు, వర్షంతో ఓ మ్యాచ్‌ రద్దు) గ్రూపు-ఎలో మూడో స్థానంలో నిలిచింది. 276 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్‌ మరో 48.3 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌటైంది. ఇయాన్‌ బెల్‌ (63) హాఫ్‌ సెంచరీ చేశాడు. కాగా ఇతర టాపార్డర్‌ బ్యాట్స్మెన్‌ విఫలమయ్యారు. చివర్లో బట్లర్‌, వోక్స పోరాడినా ఫలితం లేకపోయింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు  దిగిన బంగ్లా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 275 పరుగులు చేసింది. మహ్మదుల్లా సెంచరీ, ముష్ఫికర్‌ అర్ధసెంచరీలతో కదం తొక్కడంతో బంగ్లాదేశ్‌ భారీ స్కోరు సాధించింది.  మహ్మదుల్లా 138 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. వేగంగా ఆడిన ముష్ఫికర్‌ 76 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌ తో 89 పరుగులు సాధించాడు. సౌమ్య సర్కార్‌ 40, సబీర్‌ 14 పరుగులు చేశారు.  ఇంగ్లండ్‌ బౌలర్లలో ఆండర్సన్‌, జోర్డాన్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *