Monday, 2 November 2026

ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే వర్దిల్లాలి

 రేగోడ్( జనం సాక్షి )మే 1.మండల కేంద్రమైన రేగోడ్ లో మేడే పురస్కరించుకుని కార్మికులు సిఐటియు నాయకులు జెండావిష్కరణ కార్యక్రమం చేపట్టారు  మంగళవారం నాడు మేడే సందర్భంగా  రేగోడ్ లో సిఐటియు జిల్లా అధ్యక్షుడు సర్దార్  జెండా ఆవిష్కరించినారు అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు కార్మికులకు నష్టం కలిగించే అనేక నిర్ణయాలు తీసుకున్నారు   18 వేల కనీస వేతనం డిమాండ్ పై కనీసము చర్చించడానికి కూడా సిద్ధంగా లేదు ఫిక్స్ డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో కేంద్రం కొత్త సవరణ ముందుకు తెచ్చి కార్మికులకు ఉద్యోగులకు భద్రత లేకుండా చేసిందని ప్రభుత్వ సంస్థలలో పెట్టుబడుల ఉప సవరణను వేగవంతం చేసి ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ రైల్వే రక్షణ ఫార్మా రంగాలు పూర్తిగా బలహీనం చేస్తున్నదని అన్నారు ఉద్యోగ భద్రత వేతనము పని హక్కు సామాజిక భద్రత కోసం అమలవుతున్న బెన్ పిట్ స్థానములో భీమా ఇన్స్ రెన్స్ ఆధారిత విధానాన్ని తెచ్చి ప్రభుత్వోద్యోగుల పెన్షన్ స్థానంలో నూతన పెన్షన్ తెచ్చింది అంగన్వాడీ ఆశా ఎన్నా ఆర్ ఎచ్ ఎం వంటి కేంద్ర పథకాలను నిధులు తగ్గించింది ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీని గాలికొదిలేసింది పెద్దనోట్ల రద్దుతో లక్షలాది కార్మికులకు ఉపాధి పోయింది జీఎస్టీ వలన అదనపు భారం పడింది పారిశ్రామిక అభివృద్ధి క్షీణించి లక్షల సంఖ్యలో కార్మికులకు పని పోయింది ఈ చర్యల వల్ల కార్మిక వర్గంలో తీవ్ర అసంతృప్తి పెరిగి సమ్మెలు ఉద్యమాలు రూపంలో ప్రతిఘటన కూడా అదే మోతాదులో పెరుగుతున్నది ఈ చైతన్యాన్ని సహించలేని బిజెపి సంఘ్ పరివార్ శక్తులు సమాజంలో ఉద్రిక్త తలను పెంచుతున్నారు కుల మత ఘర్షణలను సృష్టిస్తున్నాయి మహిళలపై హత్యలు అత్యాచారాలు పెరుగుతున్నాయి ప్రజాతంత్ర హక్కులను హరిస్తున్నాయి 2019ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి దేశములో మరిన్ని ఉద్రిక్తతలు చీలికలు  తెచ్చుకునేందుకు ఈ ప్రయత్నాలు ప్రారంభించింది ఈ ప్రమాదాల పట్ల కార్మికవర్గం అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక విధానాలు మతోన్మా దానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని ప్రపంచ కార్మికులారా ఏకంకండి అని మే డే విధానాన్ని ముందుకు తీసు కెళ్లండి షెడ్యూల్ పరిశ్రమల్లో కార్మికులకు జీతాలు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుంది మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచకుండా స్థానిక కౌన్సిళ్లకు బాధ్యతను వదిలిపెట్టింది అంగన్వాడీ ఉద్యోగులపై జీవో పధ్నాలుగు పేరుతో నిత్యం వేధింపులకు గురిచేస్తున్నదని ఆర్టీసీలో సంస్కరణలను వేగంగా అమలు జరుపుతున్నదని రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిందని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు కోర్టులను అడ్డంకిగా చూపుతున్నది జీవో పధ్నాలుగు  ప్రకారము 80% పర్సెంట్ ఉద్యోగులకు జీతాలు పెంచలేదు విద్యుత్ కార్మికులను పర్మనెంట్ చేస్తానని ఆర్డి జాన్స్ పేరుతో అన్యాయం చేసింది సమ్మెలు ఉద్యమాలపై ఉక్కుపాదం మోపుతున్నదని ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నదని అన్నారు.  టిఆర్ఎస్ కార్మిక వ్యతిరేక విధానాల పై లక్షలాది కార్మికులు ఈ కాలంలో సమ్మెలు ఉద్యమాలు చేశారు అయినా ప్రభుత్వ వైఖరిలో ఏ మార్పూ రాలేదు అందుకే రాబోయే కాలంలో మరిన్ని సవరణలు సాగిస్తేనే మరిన్ని హక్కులు సాధించుకోగలమని అన్నారు మేడే స్ఫూర్తితో ముందుకు సాగుదామని తేలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యకర్తలు ఆఫీజ్, అమృతి, హన్మంతు, మల్లేశం, నారాయణ,మల్లేశం, ఏసయ్య,  ప్రభావతి, కళావతి, తదితరులు పాల్గొన్నారు,