ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

జహీరాబాద్ జూలై 2 (జనంసాక్షి)ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి అని  ఎస్ ఎఫ్ ఐ జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రాజేష్ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్ లు అన్నారు.  రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎంఈఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూజహీరాబాద్ జూలై 2 (జనంసాక్షి)ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి అని  ఎస్ ఎఫ్ ఐ జహీరాబాద్ ఏరియా కార్యదర్శి రాజేష్ ఉపాధ్యక్షులు దుర్గ ప్రసాద్ లు అన్నారు.  రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఎంఈఓ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ విద్యాసంవత్సరం ప్రారంభమై 25 రోజులు గడిచిన ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు రాలేదు అన్నారు. ఇంకా ఇంగ్లీషు, ఉర్ధు మీడీయం పాఠ్యపుస్తకాలు పూర్తిగా రాలేదు.పాఠ్యపుస్తకాలు రాకుండా పేద విద్యార్థులు చదువులు ఏలా చదవగలరు అన్నారు.  తక్షణమే పాఠ్యపుస్తకాలు విడుదల చేయాలని ఇంకా మన మండలానికి పుస్తకాలు పెండింగ్ లో ఉన్నాయి అన్నారు.రెండు జతల యునిఫామ్ కూడా ఇంత వరకు అందలేదు. పాత బట్టలతోనే విద్యార్థులు బడికి వస్తున్నారు అన్నారు. కరోనా నేఫధ్యంలో పరిసరాలను శుభ్రంగా  ఉంచాలి దానికోసం స్వచ్ఛ కార్మికులను నియమించి పాఠశాల లో  సమస్యలు పరిష్కారం చేయాలని .దీనితో పాటు మండలంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను వాటినికూడా భర్తీ చేయాలి. అన్నారు
డిమాండ్స్:1.తక్షణమే పెండింగ్ పాఠ్యపుస్తకాలు విడుదల చేయాలి.2.ప్రతి విద్యార్ధికీ. రెండు జతల నాణ్యమైన యునిఫామ్ అందించాలి అన్నారు…ఈ కార్యక్రమంలో నాయకులు చంద్ర వర్ధన్ ,కృష్ణ  ,హరీష్,అథీక్,శివకుమార్,మల్లేష్, వ పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.