రోగులకు ఆపదలో అపన్న హస్తంలా సీఎం సహాయ నిధి పథకం ఎంపీ బీబీ పాటిల్

జహీరాబాద్ జూలై 2 (జనంసాక్షి)రోగులకు ఆపదలో అపన్న హస్తంలా సీఎం సహాయ నిధి పథకం. పని చేస్తుంది అని ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. జహీరాబాద్ పట్టణానికి చెందిన సమ్రీన్ బేగం గత కొద్దరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతూ నిమ్స్ హాస్పిటల్ లో చేరినారు, ఆర్థిక సహాయం కోసం ఎంపీ బీబీ పాటిల్ ను సంప్రదించగా వెంటనే స్పందించిన ఎంపీ సీఎం సహాయ నిధి క్రింద్ర 1,50,000 రూపాయలు ఎల్ ఓ సి నీ మంజూరు చేయించారు..శనివారం తన కార్యాలయంలో సమ్రిన్ బేగం కుటుంబ సభ్యులకు సిఎం సహాయ నిధి చెక్కును అందించారు. ఈ సంద్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఆర్ పెద్ద మనసుతో అత్యవసర పరిస్థితుల్లో రోగులకు సిఎం సహాయం క్రింద ఎల్ ఓ సి ను అందిస్తు అండగా నిలుస్తున్నారు అని కొనియాడారు ,సిఎం సహాయ నిధి పథకం ఆపదలో అపన్న హస్తంలా రోగులకు అండగా నిలుస్తుంది అని పేర్కొన్నారు