Tuesday, 3 November 2026

ప్రభుత్వ పాఠశాలల పటిష్టం

మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

హైదరాబాద్‌,జూన్‌4(జ‌నం సాక్షి): ప్రభుత్వ పాఠశాలలను పటిష్టం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం గత రెండేళ్లుగా పనిచేస్తోంది. ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడుతాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి భావించి అందుకు అనుగుణంగా అనేక చర్యలు తీసుకున్నారు. గత పాలకులు ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శల నేపథ్యలంఓ మౌళిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. నిర్లక్ష్యానికి గురైన ఈ విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక్కడ ఆశించిన మేరకు విద్యాప్రమాణాలు లేవని, అక్షరాస్యత లేదని, విద్యా సంస్థలు పనిచేయడం లేదని, ఇవన్నీ సరిచేయాలనే సిఎం కెసిఆర్‌ కెజి టూ పిజి విద్యకు శ్రీకారం చుట్టారని అన్నారు. అలాగే గురుకులాలు స్థాపించామని అన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరికీ తీసిపోని విధంగా తెలంగాణ విద్యార్థులుండాలని, అప్పుడే మనం కలలుగన్న బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని భావించారు. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఆలోచనకు అనుగుణంగానే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం కావాలంటే ప్రజల భాగస్వామ్యం కావాలన్నారు. అప్పుడే మెరుగైన విద్యనందించగలమని, మంచి వసతులు కల్పించగలమని అన్నారు. పాఠశాలలు కూడా ఈ విధంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత స్థానిక ప్రజా ప్రతినిధులేనన్నారు. కార్పోరేట్‌ సంస్థలసహకారంతో స్కూళ్లలో మౌలిక వసతులు కల్పించేలా అందరూ కృషి చేయాలన్నారు.పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రం మంచి అభివృద్దిని నమోదు చేసిందన్నారు. వచ్చే సంవత్సరం పదో తరగతి ఫలితాలు వంద శాతం వచ్చేలా ఉపాధ్యాయులు కష్టపడాలని కోరారు.