కన్నడ, తమిళ టీవీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి రేఖా సింధు కారు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. చెన్నై– బెంగుళూరు హైవేపై ఈ ప్రమాదం జరిగింది. తన సహనటులు, ముగ్గురు స్నేహితులతో కలిసి సింధు ప్రయాణిస్తుంది. తమిళనాడు రాష్ట్రం వెల్లూర్ జిల్లాలోని పరణంపట్టు ప్రాంతం దగ్గర కారు అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న పెద్ద రాయిని ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నటి రేఖసింధు స్పాట్ లోనే చనిపోయింది. ఆమె ముగ్గురు స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయాయి. రోడ్డుపై వీరి మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయంటే.. కారు స్పీడ్, ప్రమాద తీవ్రత అర్థం అవుతుంది. డెడ్ బాడీలను త్రిపుత్తూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రముఖ టీవీ నటి దుర్మరణం




