Thursday, 5 November 2026

ప్రయాణికుల రద్దీని దృష్య్ట‌ 14 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలుప్రాంతాలకు 14 ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ముఖ్య పౌర సంబంధాల అధికారి ఉమాశంకర్‌ కుమార్‌ తెలిపారు. సికింద్రాబాద్‌-కాకినాడ ౌ్ఠన్‌-సికింద్రాబాద్‌ మధ్య గుంటూరు మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. రైలు నెంబర్‌ 07202 సికింద్రాబాద్‌-కాకినాడ ౌ్ఠన్‌ ప్రత్యేక రైలు ఈనెల 20, 27 తేదీలలో (శుక్రవారాల్లో) రాత్రి 7.15గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో రైలు నెంబర్‌ 07201 ఈనెల 21, 28 తేదీలలో సాయంత్రం 6.30గంటలకు కాకినాడ ౌ్ఠన్‌ నుంచి బయలుదేరుతాయి. కాచిగూడ-కాకినాడ ౌ్ఠన్‌-కాచిగూడ ప్రత్యేక రైళ్లు 2 సర్వీసులు మల్కాజిగిరి, గుంటూరు మీదుగా రాకపోకలు సాగిస్తాయి. నంబరు 07425 రైలు ఈ నెల 24న రాత్రి 10.45 గంటలకు కాచిగూడలో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో నెంబరు 07426 రైలు ఈ నెల 25న కాకినాడ ౌ్ఠన్‌ నుంచి బయలుదేరుతుంది. విజయవాడ-సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య గుంటూరు మీదుగా నాలుగు రైళ్లు నడుస్తాయి. రైలు నెంబర్‌ 07207 విజయవాడ-సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు ఈనెల 19, 26 తేదీలలో (గురువారాల్లో) రాత్రి 11.00గంటలకు విజయవాడ నుంచి బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో నెంబర్‌ 07208 రైలు ఈనెల 22, మార్చి 1 తేదీలలో (ఆదివారాల్లో) రాత్రి 11.15గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతాయి. తిరుపతి-నర్సాపూర్‌-తిరుపతి మధ్య 4 జనసాధారణ్‌ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *