Tuesday, 3 November 2026

ప్రవాస భారతీయులు మిషన్‌ కాకతీయలో భాగస్వాములు కండి

2

మహా ఉద్యమంగా చెరువుల పునరుద్ధరణ

తొలిదశలో 500 తలాబ్‌లు, 15 రోజుల్లో టెండర్లు

రంగారెడ్డి,డిసెంబర్‌, 21 (జనంసాక్షి) :చెరువుల పునరుద్ధరణపై మాట్లాడుతూ మిషన్‌ కాకతీయ కింద జూన్‌ కల్లా మొదటి దశలో 20 శాతం పునరుద్ధరణ పనులను పూర్తి చేస్తామని హరీశ్‌రావు చెప్పారు. టెండర్ల ప్రక్రియలో నామినేషన్‌ విధానానికి స్వస్తి చెప్పామని, అంతా ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ ఆధారంగానే పారదర్శకంగా నిర్వహిస్తామని అన్నారు. పనుల్లో నాణ్యత లోపిస్తే సంబంధిత కాంట్రాక్టర్‌ నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తామని హెచ్చరించారు. గతంలో చిన్న కాంట్రాక్టర్‌లకు రూ.10 లక్షల పనులు మాత్రమే ఇచ్చారని దాన్ని రూ.50 లక్షల వరకు పెంచాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. తొలిదశలో 500 చెరువులను పునరుద్ధరిస్తామన్నారు. 46 వేల చెరువుల్లో తొలిదశలో 9 వేల చెరువుల పునరుద్ధరిస్తామన్నారు. చెరువులు కబ్జాలకు కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని, ఇందుకోసం ప్రతి రెవెన్యూ రికార్డును రెక్టిఫై చేయాలన్నారు. పునరుద్ధరణ పనుల్లో వీఆర్వోలను భాగస్వాములను చేయడంతోపాటు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌ నుంచి ఈత విత్తనాలను తీసుకువచ్చి చెరువుల గట్లవిూద నాటనున్నట్లు హరీశ్‌రావు చెప్పారు. ప్రవాస భారతీయులు మిషన్‌ కాకతీయలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైతే మరో రూ.2 వేల కోట్లు ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం విూద బురద చల్లేందుకు కొందరు యత్నిస్తున్నారని అంటూ గతంలో సమగ్ర కుటుంబ సర్వే చేపట్టినపుడు కూడా చాలామంది దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. రేపటి బంగారు తెలంగాణ నిర్మాణానికి పునాది ఆ సమగ్ర కుటుంబ సర్వేనని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *