Monday, 2 November 2026

ప్రశ్నించటమే పాపమా : కుంబ్లేపై BCCI గుస్సా

ఐసీసీ ఛాంపియన్స్ లో ట్రోపీలో టీమిండియా పాల్గొంటుందా.. పాల్గొనదా..? ఇప్పుడిది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదిలా ఉంటే జట్టును ప్రకటించండని BCCI కోరిన పాపానికి .. టీమిండియా కోచ్ అనిల్ కుంబ్లే చిక్కుల్లో పడ్డారు. డిపెండింగ్ ఛాంపియన్ గా ఉన్న భారత్.. సిరీస్ లో పాల్గొనడానికి రెడీగా ఉందని.. టీమ్ ను అనౌన్స్ చేయాలని BCCIకి లెటర్ రాశారు కుంబ్లే. దీనిపై గుస్సా అవుతున్నారు పెద్దలు. ఇదేమైనా వ్యక్తిస్థాయిలో తీసుకునే నిర్ణయమా.. ఎవరి సొంత నిర్ణయాలు పనికి రావని కుంబ్లేకి ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు.

ఆదాయం విషయంలో ఐసీసీ వ్యవహరించిన తీరుతో కినుకు వహించిన BCCI.. టీమ్ ప్రకటించకుండా తాత్సారం చేస్తోంది. దీనిపై సచిన్, ద్రావిడ్ లాంటి సీనియర్ క్రికెటర్లు కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నారు. అయినా కుంబ్లేని ఒక్కడినే అధికారులు టార్గెట్ చేయడంపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక కోచ్ గా తన టీమ్ సిరీస్ లో పాల్గొనాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా అంటున్నారు ఫ్యాన్స్. షెడ్యూల్ ప్రకారం జూన్ నుంచి ఛాంపియన్స్ ట్రోపీ ప్రారంభంకానుంది. జూన్ 4న పాక్ తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆదివారం జరిగే సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనుంది BCCI

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *